Saturday 1 February 2014

షీర్‌ఖుర్మా

కావలసిన పదార్థాలు
పాలు -1 లీటర్‌, పంచదార - పావుకిలో
సేమ్యా - 100 గ్రాములు, నెయ్యి - 100 గ్రాములు
జీడిపప్పు - 25 గ్రాములు, బాదంపప్పులు - 25 గ్రాములు
పిస్తా - 25 గ్రాములు, కిస్‌మిస్‌ - 25 గ్రాములు
సారపప్పు - 25 గ్రాములు, మిల్క్‌మెయిడ్‌ లేదా కోవా - 2 టీస్పూన్లు
ఎండు ఖర్జూర - 25 గ్రాములు, యాలకులు - 8
కర్బూజా గింజలు - 25 గ్రాములు
తయారు చేసే విధానం
సేమ్యాను నేతిలో దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం, పిస్తా, సారపప్పు, కర్బూజా గింజలు నేతిలో వేయించుకోవాలి. పాలు కాగపెట్టుకొని అందులో పంచదార వేసి మరికొద్ది సేపు పాలు కాగనివ్వాలి. అందులో వేయించిన సేమ్యా వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. పొయ్యిమీద నుండి దింపి వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు.... అన్నీ అందులో వేస్తే సరి. రుచికరమైన షీర్‌ఖుర్మా రెడీ.

No comments:

Post a Comment