Saturday, 1 February 2014

ఆలూ పూర్ణాలు


కావలసిన పదార్థాలు
ఆలూ(బంగాళదుంపలు)-1/2 కిలో
పంచదార - కప్పు
యాలకులు - 3 (మెత్తగా పొడిచేసుకోవాలి)
నూనె - వేయించడానికి సరిపడా
జీడిపప్పు - 50 గ్రాములు, మైదా- కప్పు
బియ్యంపిండి - కప్పు, వంటసోడా - చిటికెడు
పచ్చికొబ్బరి తరుగు - 1/2 కప్పు
నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు
తయారుచేసే విధానం
మైదా, బియ్యంపిండి, వంటసోడాలను కలిపి దానిలో కొద్దిగా నీళ్ళు పోసి దోశ పిండిలా కలిపి రెండు గంటలు నాన బెట్టాలి. బంగాళదుంపలను ఉడకబెట్టి పొట్టు తీసి మెత్తగా మెదుపుకోవాలి. ఒక గిన్నెలో పంచదార పోసి కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్‌ మీద పెట్టి కలుపుతూ లేత పాకం (ఒక ప్లేటులో నీళ్లుపోసి పాకం వేస్తే మెత్తగా ఉండ అయితే చాలు) వచ్చేవరకూ తిప్పుకోవాలి. అందులో మెదిపి పెట్టుకున్న బంగాళదుంప ముద్ద, యాలకులపొడి, నేతిలో వేయించిన జీడిపప్పు వేసి కలపాలి. తరువాత చిన్న చిన్న ఉండలు (పూర్ణాలు మాదిరి) చేసి పెట్టుకోవాలి. బంగాళదుంప ఉండల్ని ముందుగా కలిపి పెట్టుకున్న మైదా, బియ్యంపిండి మిశ్రమంలో ముంచి కాగిన నూనెలో వేసి దోరగా వేగనివ్వాలి. అంతే ఆలూ పూర్ణాలు రెడీ. నోట్లో వేసుకుంటే మెత్తమెత్తగా తియ్య తియ్యగా భలే ఉంటాయి. మరి మీరూ ప్రయత్నిస్తారుగా!

No comments:

Post a Comment