Saturday, 1 February 2014

టమాటా మసాలా

కావలసిన వస్తువులు
టమాటాలు - పావుకిలో, చింతపండు - 100గ్రా||, నువ్వులు - 50గ్రా||,
కొబ్బరి - 1 చిప్ప, పల్లీలు - 50 గ్రా||, జీలకర్ర - 2టీ స్పూన్లు,
మెంతులు - టీ స్పూను, ఉల్లిగడ్డ - 2 పెద్దవి, కారం - 2 స్పూన్లు,
ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, నూనె - 50 గ్రా||
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1 టేబుల్‌ స్పూను
తయారుచేసే పద్ధతి
జిలకర, నువ్వులు, పల్లీలు, మెంతులు వేయించుకొని పొడి చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు, కారం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. టమాటాలను గుత్తి వంకాయ లాగా 4 ముక్కలు కోసి కొద్ది నూనెలో వేయించి తీయాలి. తాలింపు వేసుకొని నూరి ఉంచిన పేస్ట్‌ అంతా పచ్చి వాసన పోయేలా వేయించాలి. అందులో చింతపండు రసం పోసి చిక్కగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. దింపేముందు వేయించిన టమాటాలను వేయాలి. బిర్యానీలో తింటే బావుంటుంది.

No comments:

Post a Comment