కావలసిన పదార్థాలు
సేమ్యా - కప్పు, పంచదార - కప్పు
నెయ్యి - 1/2 కప్పు
యాలకుల పొడి - 1/2 టీ స్పూన్
పచ్చికొబ్బరి తురుము- కప్పు
జీడిపప్పు, కిస్మిస్- 50 గ్రాములు
తయారుచేసే విధానం
స్టవ్ మీద బాండీ పెట్టి రెండు టీస్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పూ, కిస్మిస్
వేయించుకోవాలి. తర్వాత సేమ్యా కూడా దోరగా వేయించుకోవాలి. అడుగుమందంగా ఉన్న
గిన్నెలో మూడు కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. మరిగే నీటిలో సేమ్యా వేసి
ఉడికిన తర్వాత పంచదార వేసి కలపాలి. పంచదార వేయడం వల్ల కొద్దిగా పలచగా
అవుతుంది. అది గట్టిపడే వరకూ తిప్పుతూ ఉండాలి. తర్వాత నెయ్యి, యాలకులపొడి,
జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలిపాలి. హల్వా గిన్నెకు అంటుకోకుండా ఉంటే
రెడీ అయిపోయినట్లే. స్టవ్ మీద నుంచి దించి వడ్డించుకుని వేడివేడిగా
తినొచ్చు. లేదా చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టుకొని చల్లచల్లగా కూడా తినొచ్చు.
No comments:
Post a Comment