Saturday, 1 February 2014

పోకుండలు

కావలసిన పదార్థాలు
బియ్యం - 2 కప్పులు
బెల్లం - కప్పు (పొడిచేసి కొలవాలి)
తెల్లనువ్వులు - 4 టీ స్పూన్లు
నెయ్యి - 2 టీ స్పూన్లు
ఎండు కొబ్బరి - కప్పు (తురుము)
తయారుచేసే విధానం
బియ్యం నానబెట్టి పిండిచేసుకోవాలి. ఆ పిండిని మెత్తగా జల్లించుకోవాలి. నువ్వులపప్పును నూనె వేయకుండా బాండీలో దోరగా వేయించుకోవాలి. అదే బాండీలో నెయ్యి వేసి ఎండుకొబ్బరి తురుమును వేసి దోరగా వేపుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె స్టవ్‌ మీద పెట్టి బెల్లంపొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం వచ్చే వరకూ కలుపుతూ ఉండాలి. పాకం ఉండకడితే (ఒక ప్లేటులో నీళ్లుపోసి పాకం వేస్తే ఉండ కట్టాలి) చాలు. అప్పుడు బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి (చలిమిడిలాగా) స్టవ్‌ మీద బాండీ పెట్టి నూనె పోసి బాగా కాగనివ్వాలి. ఈలోగా పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని గుండ్రంగా రెండు చేతుల మధ్య ఉంచి నున్నగా చుట్టి నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేవరకూ వేయించుకోవాలి. గాలి చొరని డబ్బాలో వేసి పెట్టుకొంటే 15రోజుల వరకూ నిల్వ ఉంటాయి. ఇవి తినడానికి చాలా బాగుంటాయి.

No comments:

Post a Comment