Saturday, 1 February 2014

బాదం హల్వా


కావలసిన పదార్థాలు
బాదంపప్పు - 200 గ్రాములు
పంచదార - కప్పు, పాలు - 1/2 కప్పు
యాలకులపొడి - అరస్పూను
పచ్చకర్పూరం - చిటికెడు, నెయ్యి - కప్పు
జీడిపప్పు, కిస్మిస్‌-50 గ్రాములు
తయారుచేసే విధానం
బాదంపప్పు మునిగేలా నీళ్ళుపోసి నాలుగు గంటలు నానబెట్టాలి. అంత సమయం లేకపోతే బాగా మరిగించిన నీటిలో గంట నానబెట్టినా చాలు. తర్వాత పై పొట్టు తీసేసి నీళ్లు పోసి మిక్సీలో వేసి పాలుపోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులోనే పంచదార కూడా వేసి కలపాలి. సన్నని మంటమీద మందపాటి గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి దగ్గరపడేవరకూ కలుపుతూ ఉండాలి. దించేముందు నెయ్యి, యాలకులపొడి, పచ్చకర్పూరం, నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్‌లు వేసి బాగా కలియబెట్టాలి. హల్వాని గరిటెతో తీసి చేత్తో పట్టుకొంటే అంటకపోతే తయారయిపోయినట్లే. అంతే బాదం హల్వా రెడీ. ఇది చాలా మృదువుగా రుచిగా ఉంటుంది.

No comments:

Post a Comment